![]() |
![]() |

సుమ అడ్డా షో ప్రతీ వారం లాగే ఈ వారం కూడా నవ్వించింది. ఈ షోకి గెస్టులుగా వచ్చిన అఖిల్, సాక్షి ఇద్దరూ మంచి జోష్ తో గేమ్ షో ఆడి డబ్బులు గెలుచుకున్నారు. ఇక సెకండ్ రౌండ్ "నువ్వా- నేనా" అనే సెగ్మెంట్ లో బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే పిక్ ఎవరిదో గెస్ చేసి చెప్పే రౌండ్ ఇది. అందులో మహేష్ బాబు పిక్ ని గుర్తు పట్టి అఖిల్ ఆన్సర్ కరెక్ట్ గా చెప్పాడు. "పోకిరి మూవీని 50 సార్లు చూసాను..అంత ఇష్టం ఈ మూవీ..మహేష్ బాబు గురించి ఏం చెప్తాం. ఆయన పోకిరి 2 చేస్తే బాగుంటుంది" అని చెప్పాక పోకిరి మూవీలోంచి పండుగాడు డైలాగ్ చెప్పాడు అఖిల్.
"మనం" మూవీలో అక్కినేని ఫామిలీ మొత్తం కలిసున్న పిక్ వేసేసరికి ఆన్సర్ కరెక్ట్ గా చెప్పాడు అఖిల్. "ఇదొక బ్యూటిఫుల్ మెమరీ కదా తాతగారి గురించి ఎమన్నా చెప్పాలనుకుంటున్నారా" అని అడిగేసరికి " తాతగారి లాస్ట్ డేస్ అన్నీ నాకు ఎపిక్ ఎండింగ్స్. ఎప్పటికీ మర్చిపోలేని గుర్తులు..ఆయన ఏది ఇష్టపడతారో అదే చేస్తారు. హాస్పిటల్ బెడ్ మీద ఉండి ఈ సీన్ కోసం డబ్బింగ్ చేశారు. ఇంతకన్నా ఏం చెప్తాం ఆయన గురించి. ఆయనే నా హీరో" అని చెప్పాడు.
ఇక రాంచరణ్ గురించి చెప్తూ "తాను నా హార్ట్ బీట్. నా బ్రదర్...మా రిలేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నా సెల్ రింగ్ టోన్ కూడా చిట్టిబాబు అని ఉంటుంది" అని చెప్పాడు. సాంగ్స్ విషయానికి వస్తే ప్రభాస్ గారికి, నాగచైతన్యకు ఏ సాంగ్ డేడికేట్ చేస్తారు అని అడిగేసరికి ప్రభాస్ కి డార్లింగ్ సాంగ్ , నాగచైతన్యకు మనంలో ఒక క్లబ్ సాంగ్ ని డేడికేట్ చేస్తాను" అని చెప్పాడు అఖిల్.
![]() |
![]() |